కిమ్ శర్మ.. ‘ఖడ్గం’ సినిమాతో తెలుగు వారికి గుర్తుండిపోయే హీరోయిన్. ఇంతేగాక బాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాలతో, యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసిగా కూడా కిమ్ గుర్తుంటుంది. ప్రస్తుతానికి అయితే ఆమె అంతగా వార్తల్లో లేదు. కొన్నేళ్ల కిందట వివాహం కూడా అయిపోయింది. అయితే తాజాగా కిమ్.. భర్తను వదిలి ఇండియా వచ్చేసింది. అంతేగాక.. మరో వ్యక్తితో సన్నిహితంగా తిరుగుతోందని బాలీవుడ్ పత్రికలు చెబుతున్నాయి. ఇది ఇల్లీగల్ ఎఫైర్ అంటూ కథనాలు వస్తున్నాయి!

అలీ పుంజానీ అనే వ్యాపారిని వివాహం చేసుకుంది కిమ్. అతడితో కలిసి కెన్యాలో కాపురం పెట్టిందట. అయితే ఏమైందో ఏమో కానీ.. ఈమె అతడిని వదిలి వచ్చేసిందట. అంతేగాక మెన్స్ వేర్ డిజైనర్ అర్జున్ ఖన్నాతో కిమ్ సన్నిహితంగా మెలుగుతోందని సమాచారం. వీళ్లిద్దరూ కలిసి పలు బహిరంగ వేదికలపై జంటగా కనిపించారు.

ఈ అర్జున్ ఖన్నా అనే వ్యక్తికి కూడా వివాహం అయ్యింది. విడాకులు ఏమీ తీసుకోలేదు. కానీ ఇతడు కిమ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ విధంగా వీరి బంధం చర్చనీయాంశంగా మారింది. గమనించాల్సిన విషయం ఏమిటంటో కిమ్ కు బ్రేకప్ లు ఏమీ కొత్త కాదు. యువరాజ్ తో ఈమె బంధం చాన్నాళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఒక స్పానిష్ బాయ్ ఫ్రెండ్ తో స్నేహం- ప్రేమ- ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్లింది కథ. అతడితో బ్రేకప్ అనంతరం కెన్యన్ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు అది కూడా ముగిసినట్టే అని టాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here