ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం నిత్యామీనన్ స్టయిల్. గతంలో ప్రభాస్ ఎవరంటూ పెద్ద దుమారం రేపింది ఈ భామ. అలాంటిది ఇప్పుడు తన వ్యవహార శైలికి భిన్నంగా రియాక్ట్ అవుతోంది. చెప్పాల్సిన విషయాన్ని కూడా సూటిగా చెప్పలేదు. ఆ ఒక్కటి అడక్కు ప్లీజ్ అంటూ తప్పించుకుంటోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చిందా అనే ప్రశ్నకు నిత్యామీనన్ రియాక్షన్ ఇది.

“తెలుగులో కొత్త సినిమాలు సైన్ చేయలేదు. కానీ కొన్ని ఆఫర్లు ఉన్నాయి. త్వరలోనే చెబుతా. ఇక ఎన్టీఆర్ బయోపిక్ విషయానికొస్తే అందులో నేను లేను. నన్ను అడిగారు కానీ నేను చేయట్లేదు. ఇంతకంటే నేను ఎక్కువ స్పందించలేను. ప్లీజ్ వదిలేయండి.” నిత్యామీనన్ సమాధానం ఇది.

ఛాలెంజింగ్ పాత్రలుంటే ఎదురెళ్లి మరీ స్వీకరించే నిత్యామీనన్.. ఎన్టీఆర్ బయోపిక్ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించేందుకు మాత్రం నిరాకరించింది. నిజానికి ఆ పాత్ర చేస్తే నిత్యామీనన్ కు మరింత పేరు రావడం ఖాయం. కానీ ఆమె నటించడానికి నిరాకరించింది. దీనికి కారణం దర్శకుడు, హీరో అని తెలుస్తోంది.

ఎలాంటి సన్నివేశాన్నయినా సింగిల్ టేక్ లో పూర్తిచేయడం నిత్యామీనన్ స్టయిల్. రీటేక్ అంటే అస్సలు ఇష్టముండదని చెబుతుంది. ఇలాంటి హీరోయిన్ తేజ దర్శకత్వంలో నటిస్తే ఇంకేమైనా ఉందా..! కచ్చితంగా గొడవలు అయిపోతాయి. గతంలో కొంతమంది నటీనటులపై తేజ చేయిచేసుకున్న విషయం నిత్యామీనన్ కు తెలియంది కాదు. ఇక హీరో విషయానికొస్తే బాలయ్య వ్యవహార శైలి గురించి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లకు తెలియంది కాదు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ ఆఫర్ ను ఈమె రిజెక్ట్ చేసిందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here