మొన్నటికి మొన్న వినాయక్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు సాయిధరమ్ తేజ్. ఈరోజు మరో సినిమా ప్రారంభించాడు. కరుణాకరన్-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఈరోజు కొత్త సినిమా లాంచ్ అయింది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రానుంది ఈ మూవీ. అయితే ఈ సినిమా విషయంలో అంతా కలిసి తనను బుక్ చేశారని అంటున్నాడు సాయిధరమ్ తేజ్.

“క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై ఏడాది నుంచి సినిమా చేయాలని అనుకుంటున్నాం. కేఎస్ రామారావు రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారు. ఎవరికి ఎలాంటి కథ వస్తుందో ముందే రాసిపెట్టి ఉంటుందని నమ్ముతా. కరుణాకరన్ రాసిన కథ ఇలా నాకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈరోజు ఇలా కుదిరింది. ఈసారి అన్నీ సెట్ అయ్యాయి. కాబట్టి నో చెప్పలేకపోయాను. ఈ సినిమా నేనే చేయాలని అంతా పట్టుబట్టారు. సో.. ఈ ఏడాది ఇలా బుక్ అయిపోయాను”. కొత్త సినిమాపై తేజూ రియాక్షన్ ఇది.

ఈసారి మాత్రం ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందిస్తామని అంటున్నాడు తేజు. అటు కరుణాకరన్ కూడా తొలిప్రేమ టైపులో ఫ్రెష్ లవ్ స్టోరీ రాసుకొచ్చానని చెబుతున్నాడు. దసరా నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇప్పటికే ఈ మూవీకి 2 ట్యూన్స్ కంపోజ్ చేశాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here