వీళ్లంతా సీరియల్స్ లో నటించే ప్రముఖులు. గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ఎందుకంటే.. ఆ సీరియల్స్ లో వీళ్లు చాలా సంప్రదాయబద్ధంగా ఆరేడు మీటర్ల చీరలు కట్టుకుని.. భారతీయ గృహిణుల పాత్రలను అవలీలగా పోషించేస్తూ ఉంటారు. భారతీయ వనిత.. అంటే ఇలా ఉండాలనే అభిప్రాయాన్ని కలిగించేస్తూ ఉంటారు.

అయితే.. ఈ మధ్య కాలంలో సీరియల్ నటీమణులు బయట యమహాట్ గా కనిపించేస్తూ పోజులిచ్చేస్తున్నారు. సీరియళ్ల ద్వారా ఫేమస్ అయిన సోనారికా భడోరియా ఇన్ స్టాగ్రమ్ లో తరచూ బికినీ పోజులు పోస్టు చేసి అందరి మతులూ పోగొడుతూ ఉంటుంది.

పై ఫొటోలోని బికినీ భామలు ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్ లో భారతీయ గృహిణులుగా నటించేస్తున్న లలనామణులు. వీళ్లు శృతి ఝా, ఇంకా… లీనా అండ్ కో. ఈ మధ్య హిందీ సీరియల్స్ అన్నీ తెలుగులోకి అనువాదం అవుతున్నాయి కాబట్టి.. ఆ సీరియల్ లో అత్తింటి ఆరళ్లకు బలయ్యే వనితలుగా వీరు తెలుగు సీరియల్ ప్రేక్షకులకు పరిచయమే అయి ఉండొచ్చు. సీరియల్ లో వీరి కట్టూబొట్టుని.. ఈ హాలిడే మూడ్ లో వీరి పోజులను పోల్చి చూస్తున్న వారు మాత్రం ఆశ్చర్యపోతున్నారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here