దువ్వాడ జగన్నాథమ్ మూవీ కన్నడ భామ పూజాహెగ్డే ఇమేజ్ ను పూర్తిగా మార్చేసింది. అంతవరకు పద్ధతిగా.. సంప్రదాయ బద్దంగా కనిపించే పాత్రల్లో కనిపించిన పూజా ఒక్కసారిగా బికినీలో కనిపించి మెరుపులు మెరిపించేసింది. దీంతో టాలీవుడ్ ఆమె సొగసుకు ఫిదా అయిపోయింది. క్రేజీ ఆపర్లన్నీ ఆమెను వరసగా వెదుక్కుంటూ వస్తున్నాయి.

పూజాహెగ్డే దువ్వాడ జగన్నాథమ్ తరవాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పక్కన హీరోయిన్ గా చేయడానికి ఓకే చెప్పింది. శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం మూవీలో చేయడానికి ఆమెకు భారీమొత్తమే ఆఫర్ చేశారనే మాట టాలీవుడ్ లో గట్టిగానే అనిపించింది. దీని తరవాత పూజా ప్రిన్స్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుందని తెలిసింది. మహేష్ ప్రస్తుతం చేస్తున్న భరత్ అనే నేను తరవాత దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ఇందులో పూజానే హీరోయిన్ గా తీసుకోవాలని ఇప్పటికే డిసైడయ్యారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో రాబోయే సినిమాలోనూ హీరోయిన్ ఛాన్స్ పూజాకే వచ్చిందనేది టాలీవుడ్ లో లేటెస్ట్ టాక్.

వరసపెట్టి అల్లు అర్జున్.. మహేష్.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో నటించడమంటే అది మామూలు విషయం కాదు. స్టార్ హీరోయిన్లకే అరుదుగా దక్కే అవకాశాన్ని పూజా అవలీలగానే దక్కించుకుంది. చూద్దాం.. పూజా హెగ్గే ముందుముందు ఎన్ని మెరుపులు మెరిపించనుందో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here