అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ మాంచి పేరు తెచ్చుకున్నా కూడా సెలెక్టివ్ గా సినిమాలు ఒకె చేస్తోంది షాలిని పాండే. థియేటర్ ఆర్ట్స్ వైపు నుంచి వచ్చిన యాక్టర్ కావడంతో స్క్రిప్ట్ లు చూసి, క్యారెక్టరైజేషన్ తెలుసుకుని కానీ అంగీకరించడం లేదు. అలాంటి అమ్మడి మీద ఇప్పుడు హీరో నిఖిల్ చూపుపడింది.

మార్చి 2 నుంచి ప్రారంభమవుతోంది. గణితన్ తెలుగు వెర్షన్. కేథరన్ దగ్గర నుంచి మూడు నాలుగు ఆప్షన్ లు చూసారు. కానీ పెయిర్ సెట్ అయితే క్యారెక్టర్ కు సూట్ కావడం లేదు.

క్యారెక్టర్ కు సూట్ అయతే పెయిర్ సెట్ కావడం లేదు. ఆఖరికి షాలిని పాండే దగ్గర ఆగారు. ఆమె కూడా దాదాపు ఓకె చెప్పింది. కానీ స్క్రిప్ట్ క్యారెక్టరైజేషన్ తెలియాలని కోరడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంతోష్ డైరక్ట్ చేయబోయే ఈ సినిమాకు ఏర్పాట్లు అన్నీ పూర్తి కావడంతో హీరోయిన్ ఎంపికను ఫైనల్ చేసే పనిలో వున్నారు. షాలిని స్క్రిప్ట్ చూసి ఓకె అనేస్తే ఓ పనయిపోయినట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here