కాజల్ అగర్వాల్ గురించి మళ్లీ రూమర్లు గుప్పుమంటున్నాయి. ఆమె ప్రేమలో పడిందనే మాట వినిపిస్తోంది. ప్రత్యేకించి తమిళనాట ఈ వార్తలు మరింత ఊపు మీదున్నాయి. ఈమె ఒక తెలుగు హీరోతో ప్రేమలో పడిందని తమిళ మీడియా కోడై కూస్తోంది. మరి ఎవరా హీరో అంటే.. దగ్గుబాటి రానా! ఈ హీరోతో కాజల్ ప్రేమలో పడిందని.. త్వరలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తమిళ మీడియా వర్గాలు రాస్తూ ఉండటం గమనార్హం.

ప్రస్తుతం కాజల్, రానాలు ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ అని తమిళ మీడియా పేర్కొంటోంది. మరి కలిసి నటించినంత మాత్రాన ప్రేమలో పడినట్టా? పెళ్లి చేసుకోబోతున్నట్టా? అనేది ఆలోచించాల్సిన విషయమే.

కానీ కాజల్ చేసిన కొన్ని వ్యాఖ్యానాలు వీరిద్దరి మధ్యన సమ్ థింగ్ అనే ఊహాగానాలకు బలాన్ని ఇస్తున్నాయి. మరి కాజల్ ఏమన్నదంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు పెళ్లి చేసుకునే ఆసక్తి ఉందని, అది సినిమా వ్యక్తి అయినా.. పర్వాలేదని చెప్పుకొచ్చింది. అయితే ఒకే ఒక షరతు విధించింది. ఏమిటా షరతు అంటే.. అతడు కచ్చితంగా పొడగరి అయి ఉండాలనేది.

అతడు ఆరు అడుగుల హైట్ కు తగ్గకుండా ఉండాలని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ చెప్పిన ఈ మాటలు.. ఆమె రానాతో ప్రేమలో పడిందనే ఊహాగానాలకు కారణం అవుతున్నాయి. అయితే తను రానాను ఊహించుకుని ఆ మాటలు చెప్పలేదని.. ఏదో క్యాజువల్ గా చెప్పానని.. తనపై అలాంటి కథనాలు రాయడం ఏమిటి? అని కాజల్ మండి పడుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here