తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసిందట
తమిళ్ నుంచి కూడా 2 ఛాన్సులు వచ్చాయట

ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ పై కొన్ని రోజులుగా షికారు చేస్తున్న పుకార్లు ఇవి. వీటిపై వెంటనే స్పందించింది ఈ బ్యూటీ. తన ఫోకస్ మొత్తం ప్రస్తుతం చేస్తున్న సినిమాపైనే ఉందని, అది కంప్లీట్ అయిన తర్వాతే కొత్త సినిమాల గురించి ఆలోచిస్తానని తెలిపింది.

“నాలాంటి కొత్తవాళ్లను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ పరిశ్రమల నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆగస్ట్ వరకు నేను కొత్త సినిమాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం చేస్తున్న ఒరు ఆడార్ లవ్ సినిమా పూర్తయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాను” ఇనస్టాగ్రామ్ లో ప్రియా వారియర్ రెస్పాన్స్ ఇది.

ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రిలీజ్ అయిన క్లిప్ తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ప్రియా వారియర్. ఆమె కన్నుకొట్టే సీన్ వైరల్ అయింది. యూత్ నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఆమె లుక్స్ ను మెచ్చుకున్నారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ నుంచి ఆమెకు పలు ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిన ఆఫర్లలో వేటినీ ప్రస్తుతానికి అంగీకరించలేదని తెలిపింది ప్రియా వారియర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here