సినిమాలు చేస్తున్నట్లు లెక్క అయితే వుంది. కానీ లెక్క పెట్టుకోదగ్గ సినిమా అయితే వుండడం లేదు. ఎకెలో వరుసగా చేస్తూవస్తున్న సినిమాలో రాజుగాడు ఒకటి. అది జనవరిలో వదుల్దామంటే అతగాడి సినిమానే రంగులరాట్నం అడ్డం పడింది. ఆ తరువాత వదుల్దామనుకుంటే, అదే సంస్థ నిర్మించిన కిర్రాక్ పార్టీ అడ్డు వచ్చింది.

తీరా చూస్తే ఏమయింది. అదీ రాలేదు. ఇదీ రాలేదు. నిఖిల్ సేఫ్ గా ఏప్రియల్ ఫస్ట్ వీక్ ను ఫిక్స్ చేసుకున్నాడు. కానీ రాజూగాడికి ఇటు మార్చిలో డేట్ లేదు. అటు ఏప్రియల్ లో డేట్ లేదు. ఇప్పుడు మే బుకింగ్ లు కూడా స్టార్ట్ అయిపోయాయి. కనీసం ఫలానా డేట్ కు విడుదల చేస్తాం అన్న క్లారిటీ కూడా నిర్మాతలకు కరువైనట్లుంది.

ఆఖరికి రాజ్ తరుణ్ గత సినిమాల్లాగే ఏదో టైమ్ లో ఏదోలా వదిలేసి చేతులు దులిపుకొనేలా కనిపిస్తోంది వ్యవహారం చూస్తుంటే. ఇప్పుడు రాజ్ తరుణ్ చేస్తున్న లవర్ షూట్ లో వుంది. దిల్ రాజు సినిమా కాబట్టి దానిపైనే ఆశలన్నీ పెట్టుకోవాలేమో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here