ఎప్పటికపుడు హై టీఆర్పీ టాపిక్ లతో నడిచే డిబేట్లపై ఆసక్తి చూపే టీవీ9పై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు వర్మ దాడి మొదలుపెట్టారు. ఎన్నోసార్లు ఆయనే టీవీ9 కు వెళ్లి చర్చల్లో పాల్గొన్నా కూడా …టీవీ9 కూడా ఎక్కువ మంది చూసే అతని ట్వీట్లకు ప్రాధాన్యం ఇచ్చినా వర్మ మాత్రం వారిపై యుద్ధం మొదలుపెట్టాడు. నిన్న లైవ్ లో *నువ్వు కరెక్టో నేను కరెక్టో… ఇపుడే లైవ్ లో పోల్ పెట్టండి* అని టీవీ9 లో రజనీకాంత్ ను పదేపదే వర్మ అడిగారు. అయితే అది ఇప్పటికిపుడు నిర్ణయం తీసుకోవడం కుదరదు అని రజనీకాంత్ చెప్పారు. లేదు ఇపుడు పెట్టండి లేకపోతే నా మీద ఆరోపణలు మానండి అంటూ వర్మ అన్నా కూడా రజనీకాంత్ కుదరదు అని చెప్పారు.

అయితే మీరు డిమాండ్ చేస్తే నేను ట్విట్టర్లో పోల్ పెడతా అని రజనీకాంత్ చెప్పడంతో లేదు లైవ్ లోనే పోల్ పెట్టాలి అంటూ ఆర్జీవీ డిమాండ్ చేశారు. కానీ దానికి రజనీకాంత్ ఒప్పుకోలేదు. అనంతరం ట్విట్టరులో కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న వర్మ లైవ్ అయిపోయాక తన ట్విట్టరులో అదే ప్రశ్నపై పోల్ పెట్టారు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ నిజాయితీ పరుడు?

అంటూ వర్మ వేసిన ప్రశ్నకు సుమారు 32 వేల మంది స్పందించి ఓటు వేశారు. కాగా అందులో 85 శాతం మంది ఆర్జీవీయే నిజాయితీ పరుడు అన్నట్టు స్పందించగా టీవీ9 రజనీకాంత్ కు కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. దీనిపై రజనీకాంత్ నుంచి ఎటువంటి స్పందన ఇంతవరకు రాలేదు. మరి ఆయన స్పందిస్తారో ? లేదో చూడాలి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here